ఎంఎన్ జే ఆస్పత్రిలో నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. సోమవారం ( సెప్టెంబర్18)న హైదరాబాద్ లోని ఎమ్ ఎన్ జే ఆస్పత్రిలో రూ.34 కోట్ల నిధులతో రోబోటిక్ సర్జరీ పరికరాలను ప్రారంభించారు మంత్రి హరీష్ రావు. ఆరోగ్య మహిళా కేంద్రాల్లో ఉచితంగా మహిళలకు క్యాన్సర్ పరీక్షలు, మందులు ఇస్తున్నామన్నారు మంత్రి హరీష్ రావు. 371 మంది మహిళలకు ఎంఎన్ జే ఆస్పత్రిలో క్యాన్సర్ చికిత్స అదిస్తుందిన్నామన్న ఆయన్న.. క్యాన్సర్ రోగుల చికిత్స కోసం ఆరోగ్య శ్రీ ద్వారా రూ. 900 కోట్లు విడుదల చేశామని తెలిపారు.
అందరికీ నాణ్యమైన ఉచిత వైద్యం అందించాలని లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని.. ఇప్పటికే ఎంఎన్ జే ఆస్పత్రిని 750 పడకల ఆస్పత్రిగా మార్చామన్నారు. గత ప్రభుత్వ హయాంలో వసతులు లేక పేషెంట్లు ఇబ్బంది పడేవారని గుర్తు చేశారు హరీష్ రావు. 100 ఆక్యూపెన్సీతో మంచి ట్రీట్ మెంట్ ను అందిస్తున్నామని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు.
ALSO READ: కాంగ్రెస్ పార్టీ హామీలన్నీ బోగస్ : మంత్రి జగదీష్ రెడ్డి
ప్రైవేట్ ఆస్పత్రుల్లో లక్షాల ఖర్చయ్యే ఆపరేషన్ కి ఎంఎన్ జే ఆస్పత్రిలో ఉచితంగా అందిస్తున్నామని మంత్రి హరీష్ రావు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు పెరగడంతో వైద్యం కోసం ప్రజలు నిమ్స్, ఎంఎన్ జే ఆస్పత్రులను ఎంచుకుంటున్నారని హరీష్ రావు అన్నారు.