హైదరాబాద్, వెలుగు : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ టెక్నాలజీ సేవలను అందించే ‘క్వాంటమ్ఏఐ’ తన గ్లోబల్ ఆఫీసును హైదరాబాద్లో బుధవారం ప్రారంభించింది. దీనిని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. ఏఐ టెక్నాలజీలు కంపెనీలకు కీలకమని అన్నారు. ఈ అమెరికా సంస్థ హైదరాబాద్కు రావడం అభినందనీయమని మంత్రి అన్నారు.
ALSO READ: ఇండియా నుంచి రూ. 15 వేల కోట్ల కాంపోనెంట్లు కొనేందుకు టెస్లా ప్లాన్