భార్యతో గొడవ.. పిల్లలకు విషం ఇచ్చిన తండ్రి

మహబూబాబాద్ జిల్లాలో విషాదఘటన చోటుచేసుకుంది. భార్యాభర్తల మధ్య కలహాలు ఒక బాలుడు ప్రాణం తీయగా, మరొక బాలుడు కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నాడు. 

మహబూబాబాద్ జిల్లా, ఆమనగల్లు శివారు బలరాంతండాలో నివసిస్తున్న రమేష్, శాంతి భార్యాభర్తలు. వీరికి నాలుగేళ్లు, రెండేళ్ల వయసున్న ఇద్దరు కుమారులు. భార్యాభర్తల మధ్య గొడవ జరగగా.. శాంతి పుట్టింటికి వెళ్లింది. దీంతో భార్యపై ఆగ్రహంతో ఊగిపోయిన భర్త ఇద్దరు పిల్లలకు విషమిచ్చి ..అక్కడి నుండి పరారయ్యాడు. 

గమనించిన స్థానికులు వెంటనే పిల్లలను మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఒక బాలుడు మరణించాడు. మరొక బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.