టీఎన్జీవో యూనియన్​లో లొల్లి.. ముగ్గురు నేతల సభ్యత్వం రద్దు చేసిన సిటీ ప్రెసిడెంట్

  హైదరాబాద్, వెలుగు: తెలంగాణ నాన్ గెజిటెడ్ సంఘం (టీఎన్జీవో )లో లొల్లి మొదలైంది. హైదరాబాద్ సిటీ యూనియన్ లో ముగ్గురు నేతల మెంబర్ షిప్​ను రద్దు చేస్తూ సిటీ ప్రెసిడెంట్ శ్రీరామ్ సోమవారం సర్క్యులర్ ఇచ్చారు. ఈ నెల 25న నిర్వహించిన సిటీ యూనియన్ ఈసీ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్​లో సిటీ యూనియన్ సెక్రటరీ శ్రీకాంత్, సెంట్రల్ యూనియన్​లో అసోసియేట్ ప్రెసిడెంట్​గా ఉన్న కస్తూరి వెంకటేశ్వర్లు, వైస్ ప్రెసిడెంట్​గా ఉన్న శ్రీనివాస్ గౌడ్ సభ్యత్వం రద్దు చేస్తూ తీర్మానం చేశారు. 30 రోజుల్లో వివరణ ఇవ్వాలని వారికి సర్క్యులర్ జారీ చేశారు. టీఎన్జీవో బైలాస్​కు వ్యతిరేకంగా యూనియన్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని అందులో పేర్కొన్నారు. 

ALSO READ:ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లను ఆకర్షించడంలో మా ప్రభుత్వం సక్సెస్ : అశ్వినీ వైష్ణవ్ 

ఆ అధికారం వాళ్లకు లేదు: కేంద్ర సంఘం ముగ్గురు టీఎన్జీవో నేతల సభ్యత్వం రద్దు సర్క్యులర్​పై కేంద్ర సంఘం జనరల్ సెక్రటరీ మారం జగదీశ్వర్ స్పందించారు. సిటీ యూనియన్ టర్మ్ ఈనెల 24తో ముగిసిందని, అదే రోజు జరిగిన కేంద్ర సంఘం ఈసీ మీటింగ్​లో ఎన్నికల నిర్వహణకు అడహాక్ కమిటీని నియమించినట్లు తెలిపారు.  ప్రెసిడెంట్ శ్రీరామ్, సెక్రటరీ శ్రీకాంత్​కు ఈసీ మీటింగ్ నిర్వహించే, సర్క్యులర్ ఇచ్చే అధికారం లేదన్నారు. ఆ సర్క్యులర్లు చెల్లబాటు కావని తెలిపారు. హైదరాబాద్ సిటీ యూనియన్ లో ఉన్న వారు కేంద్ర సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు తమ సమస్యలు, ఇబ్బందులు చెప్పుకోవాలని సూచించారు.