మరో రికార్డుకు సిద్ధమైన విక్టోరియా.. కొడుకుతో కలిసి అరేబియన్​ సీలో ఓపెన్​ వాటర్ ​స్విమ్మింగ్

మరో రికార్డుకు సిద్ధమైన విక్టోరియా.. కొడుకుతో కలిసి అరేబియన్​ సీలో  ఓపెన్​ వాటర్ ​స్విమ్మింగ్

బషీర్ బాగ్ , వెలుగు: ఇంగ్లీష్ ఛానెల్ ఈది రికార్డు నెలకొల్పిన నగరానికి చెందిన అంతర్జాతీయ స్విమ్మర్ గంధం విక్టోరియా మరో రికార్డు నెలకొల్పడానికి సిద్ధమైంది. అరేబియా మహా సముద్రంలో ముంబై సమీపంలోని మండ్యాజెట్ నుంచి గేట్ వే ఆఫ్ ఇండియా వరకు సుమారు 18 కిలోమీటర్లు తన కొడుకుతో కలిసి ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ చేయనున్నట్లు ప్రకటించారు.

బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతూ స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మహారాష్ట్ర ఒలంపిక్​ అసోసియేషన్ పర్మిషన్​తో ఈ నెల 19న డిగ్రీ చదువుతున్న తన కొడుకు స్టీఫెన్ కుమార్ (20)తో కలిసి స్విమ్మింగ్ చేయబోతున్నట్టు చెప్పారు. ఇలా చేయడం దేశంలోనే మొదటిసారి అని, ఇంత వరకు ఎవరు ఇలాంటి సాహసం చేయలేదన్నారు. అంతర్జాతీయ పిన్ స్విమ్మింగ్ పోటీల్లో ఇప్పటికే తాను తాను గోల్డ్, సిల్వర్, కాంస్య పతకం సాధించానని చెప్పారు.