వన్యప్రాణుల దాహం తీర్చేందుకు ప్రత్యేక చర్యలు

వన్యప్రాణుల దాహం తీర్చేందుకు ప్రత్యేక చర్యలు

జన్నారం, వెలుగు: కవ్వాల్ టైగర్ జోన్ లో వన్యప్రాణుల దాహం తీర్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని జన్నారం ఎఫ్​డీవో మాధవరావు తెలిపారు. ఆదివారం కవ్వాల్ టైగర్ జోన్ లోని తాళ్లపేట, జన్నారం, ఇందన్ పెల్లి రేంజ్ లలో ప్రింట్,ఎలక్ర్టానిక్ మీడియా తో ఎడ్యూకేషనల్ టూర్ నిర్వహించారు.  కవ్వాల్ టైగర్ జోన్ లో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రత్యేకంగా చూపించారు. ఈ సందర్బంగా ఎఫ్​డీవో మాట్లాడుతూ..  తపాలపూర్ బీట్ లో జింకల పునరుత్పుత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు.  

వేసవిని దృష్టిలో ఉంచుకొని వన్యప్రాణుల దాహన్ని తీర్చేందుకు ప్రత్యేకంగా జన్నారం డివిజన్ పరిధిలో వందకు  పైగా ర్యాంప్ వెల్స్ ను నిర్మించామన్నారు.  మరో పక్కా సోలార్ పంపుల ద్వారా నీటి కుంటలో నీటిని నింపి వన్యప్రాణులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు.  వాచ్ టవర్లు నిర్మించడం వల్ల పర్యాటకుల తాకిడి పెరిగిందన్నారు. ఆయన వెంట ఇందన్ పెల్లి,జన్నారం, ఎఫ్​ఆర్ వోలు హఫీజొద్దిన్ ,లక్ష్మీనారాయణ, తాళ్లపేట రేంజ్ డీఆర్ వో లుప్రమోద్ కుమార్,పోచమల్లు ,ఫారెస్ట్ సిబ్బంది ఉన్నారు.