
కౌన్ బనేగా కరోడ్‌పతి 16 వ సీజన్ విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. హోస్ట్ అమితాబ్ బచ్చన్ నిర్వహిస్తున్న ఈ షో గ్రాండ్ గా కొనసాగుతుంది. ఇందులో భాగంగా క్రికెట్ పై ఒక ప్రశ్న కంటెస్టెంట్ కు ఎదురైంది. క్రికెట్ ప్రేమికులు ఈ ప్రశ్నకు సమాధానం చాలా ఈజీగా చెప్పేస్తారు. తొలి 9 ప్రశ్నలకు ఈజీగా సమాధానం చెప్పి లక్ష 60 వేల రూపాయలను గెలుచుకున్నాడు కంటెస్టెంట్. 3 లక్షల 20 వేల రూపాయల ప్రశ్న అతనికి క్రికెట్ రూపంలో ఎదురైంది.
2024 టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్న భారత లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ఎవరు అనే ప్రశ్న హోస్ట్ అమితాబ్ అడిగారు. ఈ ప్రశ్నకు మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ అనే నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ బి అర్షదీప్ సింగ్. అర్ష్‌దీప్ సింగ్ 2024 ఏడాదికిగాను ‘ఐసీసీ మెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు అందుకున్నాడు. అలాగే, ‘మెన్స్ టీ20 ఆల్‌స్టార్ ఎలెవన్ టీమ్’కూ ఎంపికయ్యాడు.
Also Read :- న్యూజిలాండ్‌కు గాయాల బెడద
గతేడాది 18 మ్యాచ్‌ల్లో 15.31 యావరేజ్, 7.49 ఎకానమీతో 36 వికెట్లు తీసిన అర్ష్‌దీప్.. ఇండియా టీ20 వరల్డ్‌కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. మెగా టోర్నీలో పవర్‌ప్లే, డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసిన అర్ష్‌దీప్ ఎనిమిది మ్యాచ్‌ల్లో 17 వికెట్లు పడగొట్టాడు. సికందర్ రజా (జింబాబ్వే), ట్రావిస్ హెడ్ (ఆస్ట్రేలియా), బాబర్ ఆజమ్ (పాకిస్తాన్)తో పోటీపడి అర్ష్‌దీప్ ఈ అవార్డును దక్కించుకోవడం విశేషం. ప్రస్తుతం అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో 99 వికెట్లు తీసి భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసుకున్న ప్లేయర్ గా నిలిచాడు.