
పరకాల, వెలుగు : చిన్న, సన్నకారు రైతుల జీవనాధారమైన పంట భూములను గ్రీన్ఫీల్డ్ హైవేకు ఇచ్చేదిలేదని, అవసరమైతే ఆత్మహత్యలకైనా సిద్ధమని భూనిర్వాసిత రైతులు నినదించారు. కోర్టులో కేసు నడుస్తుండగా ప్రధాని గ్రీన్ఫీల్డ్హైవేకు శంకుస్థాపన ఎలా చేస్తారని ప్రశ్నిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మలను ఏఎంసీ ముందు దహనం చేశారు.
పరకాల, శాయంపేట, దామెర, మొగుళ్లపల్లి మండలాలకు చెందిన భూనిర్వాసిత రైతులు ముందుగా ఆర్డీవోకు వినతిపత్రం అందించి రోడ్డుపై ధర్నా చేశారు. అనంతరం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి మెమోరాండం అందించారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోపోతే వచ్చే ఎన్నికల్లో అధికసంఖ్యలో నామినేషన్లు వేస్తామని రైతులు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆయా మండలాల రైతులు పాల్గొన్నారు.