పెద్దపల్లిలోని ఈ సేవా కేంద్రం వద్ద .. సర్టిఫికెట్ల కోసం క్యూ లైన్లు

నిజామాబాద్ సిటీలోని ఈ సేవా కేంద్రం వద్ద జనాలు బారులు తీరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రకటించిన పథకాల లబ్ధి పొందాలంటే క్యాస్ట్, ఇన్​ కమ్ సర్టిఫికెట్లు అవసరమని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం కావడంతో క్యూ లైన్లు కట్టి సర్టిఫికేట్ల కోసం అప్లికేషన్​ పెట్టుకుంటున్నారు.

ఈ –సేవా కేంద్రం సిబ్బంది మాత్రం ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదని, సోషల్ మీడియాలో జరిగే ప్రచారాన్ని నమ్మొద్దని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ రోజురోజుకు జనాల తాకిడి పెరుగుతూనే ఉంది.

వెలుగు ఫొటోగ్రాఫర్, నిజామాబాద్