జెప్టో నష్టం రూ.1,248 కోట్లు

జెప్టో నష్టం రూ.1,248 కోట్లు

న్యూఢిల్లీ : క్విక్‌ ‌కామర్స్ కంపెనీ జెప్టోకి  2023–24లో రూ.1,248.6 కోట్ల నష్టం వచ్చింది.  అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో వచ్చిన రూ.1,272.4 కోట్ల నష్టం నుంచి కొద్దిగా తగ్గింది. కన్సల్టెన్సీ కంపెనీ టోఫ్లర్ రిపోర్ట్ ప్రకారం, ఈ ముంబై బేస్డ్ కంపెనీకి  2023–24 లో రూ.4,454 కోట్ల రెవెన్యూ రాగా, అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో వచ్చిన రూ.2,025 కోట్లతో పోలిస్తే రెండింతలు పెరిగింది. రెవెన్యూలో నష్టాల శాతం   63 శాతం నుంచి 28 శాతానికి తగ్గిందని కంపెనీ ఫౌండర్ అదిత్ పలిచా పేర్కొన్నారు.