డేంజర్.. మీ మొబైల్ లో ఈ 29 యాప్స్ వెంటనే తీసేయండి

డేంజర్.. మీ మొబైల్ లో ఈ 29 యాప్స్ వెంటనే తీసేయండి

స్మార్ట్ ఫోన్ ల హవా నడుస్తున్న ఈ రోజుల్లో సైబర్ నేరగాళ్లు టెక్నాలజీ సాయంతో రెచ్చిపోతున్నారు. నగదు, కీలకమైన సమాచారాన్ని స్మార్ట్ ఫోన్ యూజర్స్ నుంచి లాగేసుకునేందుకు కొత్త పద్ధతులు ఫాలో అవుతున్నారు. ఎట్రాక్టివ్ థీమ్స్ తో, పేర్లతో యాప్స్ రూపొందించి.. వాటిని ఫోన్లలో ఇన్ స్టాల్ చేసుకొమ్మని ఊరించి.. మాల్ వేర్ లను స్మార్ట్ ఫోన్ లలోకి  చేస్తున్నారు. దీంతో.. తమకు కావాల్సిన సమాచారాన్ని దొంగతనంగా రాబట్టుకుంటున్నారు. ఈ సమాచారంతో.. కొన్ని డేంజరస్ యాప్స్ ను గుర్తించింది గూగుల్ సంస్థ. తమ రూల్స్ కు విరుద్ధంగా ఉండటంతో.. వీటి విషయంలో అలర్ట్ గా ఉండాలని…  ఇలాంటివి ఉంటే వెంటనే డిలీట్/అన్ ఇన్ స్టాల్ చేసేయాలని కోరుతున్నారు. 29 ఆండ్రాయిడ్ యాప్స్ ను ప్లే స్టోర్ నుంచి ఇప్పటికే తొలగించింది గూగుల్.

ఇవి HiddAd కేటగిరీకి చెందిన మాల్ వేర్ యాప్స్  అని ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ క్విక్ హీల్ తేల్చింది. వీటిని ఇన్ స్టాల్ చేయగానే… ఫోన్లలో ఐకన్ మాయం అవుతుంది. వాటికి సంబంధించిన ఓ షార్ట్ కట్ హోమ్ స్క్రీన్ పై కనిపిస్తుంది. ఇలా చేయడం వల్ల.. యాప్ ను అన్ ఇన్ స్టాల్ చేయలేరు. యాప్ షార్ట్ కట్ ఐకన్ పై క్లిక్ చేయగానే.. ఫుల్ స్క్రీన్ యాడ్స్ వస్తాయి. యూట్యూబ్, ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియా యాప్స్ ను ఓపెన్ చేసినప్పుడు కనిపించే అడ్వర్టైజ్ మెంట్ యాడ్ వేర్ యాప్స్ ను.. వెంటనే ఇన్ స్టాల్ చేసేస్తాయి.

అవేంటో ఓసారి చూద్దాం.

Feel Camera HD

Filter Photo Frame

Lens Flares

Magic Effect

QR Code Scanner

Super Mark

Photo Effect Pro

Art Filter

Lie Detector Prank

New Hair Fashion

Smart Magnifier Pro

Magnifier Pro-Magnifying Glass

Magnifying Glass Pro

Cut Cut Mix

Cut Cut MIx Pro

Galaxy Overlay

Colour Splash Photo Effect

Age Face

Photo Blur

Blur Image

Super Magnifier Lite

Magnifying Pro

Qing Camera

Reflex Camera HD

First Camera HD

Rhythm Camera

Pretty Makerup Photo

Glitch Lens – Vaporwave & Ghost Photo Editor

Multi Apps- Multiple Accounts Simultaneously