మెదక్ జిల్లాలో భారీ వరదలకు వాగులో చిక్కుకున్న ఓ వ్యక్తిని ప్రాణాలు పణంగా పెట్టి రక్షించారు పోలీసులు . వ్యక్తి ప్రాణాలు కాపాడిన హోంగార్డును జిల్లా కలెక్టర్ తో పాటు ఉన్నతాధికారులు అభినందించారు.
అసలేం జరిగిందంటే.. మెదక్ జిల్లా టెక్మాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండు వాగు పొంగిపొర్లుతుండగా.. అటుగా వెళ్తున్న రమావత్ నందు అనే వ్యక్తి నీటిలో కొట్టుకుపోయి ఓ బండరాయిని పట్టుకుని ఉన్నాడు. సమాచారం అందుకున్న మెదక్ జిల్లా క్విక్ రెస్పాన్స్ టీం మెంబర్ మహేశ్ మరో ఇద్దరు యువకులు తాడు సహాయంతో కల్వర్టు మధ్యలోకి చేరుకుని తాడు సహాయంతో అతడిని నెమ్మదిగా వాగులో నుంచి సురక్షితంగా బయటకు తీశారు.
ప్రాణాలను లెక్కచేయకుండా వరద నీటిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడినందుకు మహేశ్ ను పలువురు ఉన్నతాధికారులు ప్రశంసించారు.