పులి కనిపిస్తే కాదు.. పులి మాట వింటే అమ్మో అంటాం.. అలాంటి పులి మన దగ్గరకు వస్తే.. మన కళ్ల ముందే ఉంటే.. ఓ పెద్ద పులి పిల్లిలా నడుచుకుంటూ.. ఇంట్లో వస్తే.. ఈ మాటలు వింటేనే వణుకు పుడుతుంది. అలాంటి సమయంలో 12 ఏళ్ల పిల్లోడు వ్యవహరించిన తీరు.. ఆ సమయానికి భయపడకుండా స్పందించిన తీరును చూసి నెటిజన్లు హ్యాట్సాప్ అంటున్నారు.. అద్భుతం.. ఆ టైంలోనూ కంగారు లేకుండా కూల్ గా.. అంత పెద్ద ఇష్యూను డీల్ చేసిన విదానం చూసి ముక్కున వేలేసుకుంటున్నారు నెటిజన్లు. పూర్తి వివరాల్లో వెళితే..
ఈ ఘటన మహారాష్ట్రలోని నాసిక్ మాలేగావ్ లో వెలుగు చూసింది. చిరుతపులిని ఓ ఇంట్లోకి ప్రవేశించింది. ఇంట్లో వీడియో గేమ ఆడుకుంటున్న మోహిత్ అహిరే అనే 12 ఏళ్ల బాలుడు చాకచాక్యంగా వ్యవహరించి చిరుతపులిని గదిలో బంధించాడు. ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చిరుత పులి అనుకోకుండా గదిలోకి ప్రవేశించినప్పుడు మోహిత ఇంట్లో మొబైల్ గేమ్ ఆటలో లీనమైపోయాడు. పులిని గుర్తించిన మోహిత్ మొదట్ షాక్ కు గురైనప్పటికీ కదలకుండా అలాగే ఉండిపోయాడు. చిరుత పులి చూడకుండా జాగ్రత్త పడ్డాడు.. కొద్దసేపటి తర్వాత మెల్లగా ఇంట్లోంచి బయటికి వచ్చి వేగంగా తలుపులు మూశాడు. ఈ ఘటన మంగళవారం (మార్చి 5) ఉదయం 7 గంటల ప్రాంతంలో జరిగింది.
సమాచారం తెలుసుకున్న మాలేగావ్ అటవీశాఖ అధికారులు సంఘటన స్థలానికి వచ్చి చిరుతపులిని బంధించి తీసుకెళ్లారు. ఘటన జరిగిన ప్రాంతం నదికి సమీపంలో ఉండటంతో ఈ ప్రాంతానికి అప్పుడపుడు చిరుత పులులు కనిపిస్తున్నాయని అటవీశాఖ అధికారులు చెప్పారు. మోహిత్ అహిరే చాకచక్యంగా, సమయస్ఫూర్తితో ప్రమాదం నుంచి బయటపడటమే కాకుండా చిరుతపులి బంధించి ఇతరులను కాపాడినందుకు పలువురి ప్రశంసలందుకున్నాడు.
#Nashik: Quick-Thinking 12-Year-Old Locks #Leopard In Room, CCTV Footage Goes Viral#Maharashtra pic.twitter.com/lFJDmNmcDS
— Free Press Journal (@fpjindia) March 6, 2024