క్వింటాలు మిర్చి @ రూ.24 వేల 450

ఖమ్మం టౌన్, వెలుగు: నగరంలోని వ్యవసాయ మార్కెట్ లో క్వింటాలు ఏసీ మిర్చి ధర రూ.24,450 గా జెండా పాట పలికింది. మిర్చి క్వాలిటీ ఆధారంగా చేసుకుని వ్యాపారులు రూ.23 వేల నుంచి రూ.23,500 ధరకు కొనుగోలు చేశారు. 

Also Read:వికలాంగుల గుడిసెలను జేసీబీలతో కూల్చేశారు

నాన్ ఏసీ మిర్చి ధర మాత్రం రూ.17 వేల నుంచి రూ.18 వేల వరకు క్వాలిటీ ఆధారంగా వ్యాపారులు ధర చెల్లించారు. మార్కెట్ కు మంగళవారం 4 వేల బస్తాలు అమ్మకానికి వచ్చినట్లు ఏఎంసీ సెక్రెటరీ రుద్రాక్ష మల్లేశం తెలిపారు.