క్వింటన్ డికాక్.. ప్రస్తుతం ఈ సౌత్ ఆఫ్రికా బ్యాటర్ వరల్డ్ కప్ లో చెలరేగి ఆడుతున్నాడు. సెంచరీల మోత మోగిస్తూ తమ జట్టుకు ఒంటి చేత్తో విజయాలను అందిస్తున్నాడు. ఈ వరల్డ్ కప్ తర్వాత వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్ తన చివరి టోర్నీలో విధ్వంసం సృష్టిస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచుల్లో మూడు సెంచరీలు చేసి పలు రికార్డులపై కన్నేశాడు. ఈ క్రమంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డుపై గురి పెట్టాడు.
వరల్డ్ కప్ లో భాగంగా ముంబై వాంఖడే స్టేడియంలో సౌత్ ఆఫ్రికా తో బంగ్లాదేశ్ తలపడుతుంది. ఈ మ్యాచ్ లో సెంచరీ చేసిన డికాక్.. ఈ మెగా టోర్నీలో తన సెంచరీల సంఖ్యను మూడుకు పెంచుకున్నాడు. మరో మూడు సెంచరీలు చేస్తే ఒక వరల్డ్ కప్ లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ గా నిలుస్తాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఒకే వరల్డ్ కప్ లో 5 సెంచరీలు చేసి టాప్ లో ఉన్నాడు.
2019 ఇంగ్లాండ్ లో జరిగిన ఈ వరల్డ్ కప్ లో రోహిత్ 5 సెంచరీలు బాదేశాడు. శ్రీలంక దిగ్గజం కుమారా సంగక్కర 2015 లో నాలుగు సెంచరీలు చేసి ఈ లిస్టులో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక డికాక్ సెంచరీతో ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుంది. 42 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది. డికాక్ 137 పరుగులతో, క్లాసన్ 43 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. కెప్టెన్ మార్కరం 60 పరుగులతో రాణించాడు.
Most hundreds scored in India by away players (Odi format)
— Cricsimp (@cricsimp) October 24, 2023
1.Abd- 7
2.Gayle- 6
3.Decock-5*
4.Ponting-5
5.Nj astle-4
Quinton decock is having a remarkable wc pic.twitter.com/kJLsi7OBqb