
గౌహతి వేదికగా రాజస్థాన్ రాయల్స్ పై జరిగిన మ్యాచ్ లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఓపెనర్ క్వింటన్ డి కాక్ (61 బంతుల్లో 97: 8 ఫోర్లు, 6 సిక్సర్లు) ఒంటి చేత్తో తమ జట్టును గెలిపించాడు. బౌలర్లకు అనుకూలంగా ఉన్న పిచ్ పై బౌండరీలతో హోరెత్తించాడు. బ్యాటింగ్ భారాన్ని మొత్తం ఒక్కడే మోస్తూ కేకేఆర్ కు టోర్నీలో తొలి విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్ లో డికాక్ ఇన్నింగ్స్ హైలెట్ గా నిలిచింది. సెంచరీ మిస్ అయినా ఐపీఎల్ లో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. డికాక్ సెంచరీతో పాటు తన వికెట్ కీపింగ్ లోనూ తెలివి ప్రదర్శించాడు.
ఆకట్టుకునే క్యాచ్ తో అందరినీ షాక్ కు గురి చేశాడు. ఇన్నింగ్స్ 8 వ ఓవర్ మూడో బంతికి రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్.. వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో సిక్సర్ బాది మంచి జోరు మీదున్నాడు. ఇదే ఊపులో మరో సిక్సర్ కొట్టాలని ఐదో బంతిని భారీ షాట్ కు ప్రయత్నించి గాల్లోకి లేపాడు. టైమింగ్ సరిగా కుదరకపోవడంతో బంతి అక్కడే లేచింది. ఈ సమయంలో డికాక్ తన సమయస్ఫూర్తి చూపించాడు. హెల్మెట్ తీసేసి క్యాచ్ అందుకున్నాడు. క్యాచ్ బాగా హైట్ వెళ్లడంతో హెల్మెట్ అడ్డుగా ఉందని గ్రహించిన డికాక్.. హెల్మెట్ కింద పడేసి మిడ్ పిచ్ లోకి వచ్చి క్యాచ్ అందుకోవడం సోషల్ మీడియాలో నెటిజన్స్ ను ఆకట్టుకుంటుంది.
Also Read : రాజస్థాన్‌కు బుర్ర లేదు..
That catch by Quinny de Kock though 🤌 #IPL2025 pic.twitter.com/trTFzhQVb7
— Eems (@NaeemahBenjamin) March 26, 2025
ఈ మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ ఐపీఎల్–18లో బోణీ చేసింది. రాజస్తాన్ రాయల్స్ మళ్లీ ఓడింది. ఛేజింగ్‌లో క్వింటన్ డికాక్ (61 బాల్స్‌లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో 97 నాటౌట్) చెలరేగడంతో.. బుధవారం జరిగిన రెండో మ్యాచ్‌లో కోల్‌కతా 8 వికెట్ల తేడాతో రాయల్స్‌పై నెగ్గింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ 20 ఓవర్లలో 151/9 స్కోరు చేసింది. తర్వాత కోల్‌కతా 17.3 ఓవర్లలో 153/2 స్కోరు చేసింది. రఘువంశీ (22 నాటౌట్) ఫర్వాలేదనిపించాడు. డికాక్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.