ODI World Cup 2023: కోహ్లీని వెనక్కి నెట్టిన డికాక్.. వరల్డ్ కప్‪లో మరో రన్ మెషీన్

ODI World Cup 2023: కోహ్లీని వెనక్కి నెట్టిన డికాక్.. వరల్డ్ కప్‪లో మరో రన్ మెషీన్

దక్షిణాఫ్రికా స్టార్ ఓపెనర్ డికాక్ క్వింటన్ డికాక్ వరల్డ్ కప్ లో అదేపనిగా చెలరేగుతున్నాడు. ఈ మెగా టోర్నీలో మొత్తం ఐదు మ్యాచులాడిన ఈ స్టార్ ఓపెనర్ మూడు సెంచరీలతో ఏకంగా 407 పరుగులు చేసి టోర్నీ టాప్ స్కోరర్ గా నిలిచాడు. నిన్నటివరకు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 354 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా తాజాగా బంగ్లాదేశ్ పై జరుగుతున్న మ్యాచ్ లో భారీ సెంచరీ చేసి విరాట్ ని వెనక్కి నెట్టేశాడు. 

వరల్డ్ కప్ లో భాగాంగా ప్రస్తుతం దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ఈ  మ్యాచ్ లో డికాక్ 140 బంతుల్లోనే 170 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. ఈ ఇన్నింగ్స్ ముందువరకు 237 పరుగుల వద్ద ఉన్న డికాక్ .. ఈ తుఫాన్ ఇన్నింగ్స్ ధాటికి 407 పరుగులకు చేరుకున్నాడు. తొలి రెండు మ్యాచ్ లో సెంచరీలు చేసిన డికాక్ ఆ తర్వాత రెండు మ్యాచ్ ల్లో విఫలమయ్యాడు.

Also Read:కుర్రాళ్లతో కలకలలాడుతున్న వందే భారత్ 

కోహ్లీ ,డికాక్ తర్వాత రోహిత్ శర్మ, రిజవాన్, రచిం రవీంద్ర వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. ఇక బౌలర్ల విషయానికి వస్తే.. 12 వికెట్లతో సాంట్నర్ టాప్ వికెట్ టేకర్ గా నిలిచాడు. టీమిండియా స్టార్ బౌలర్, శ్రీలంక పేస్ బౌలర్ మధు శంక 11 వికెట్లతో వరుసగా  రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.