బోధన్, వెలుగు : వర్డ్(ఉమెన్స్ఆర్గనైజేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్) ఆధ్వర్యంలో బోధన్, సాలూర జడ్పీ ఉన్నత పాఠశాలలోని 8, 9, 10 తరగతుల విద్యార్థులకు బుధవారం క్విజ్ పోటీలు నిర్వహించారు. పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
కార్యక్రమంలో వర్డ్ స్వచ్చంద సంస్థ కమ్యూనిటీ కో-ఆర్డినేటర్లు కె.చంద్రశేఖర్, జి.రజిత, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వి.నరేందర్, పి.విజయ్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.