కొటేషన్ గ్యాంగ్‌‌‌‌‌‌‌‌ చిత్రం ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విడుదల

కొటేషన్ గ్యాంగ్‌‌‌‌‌‌‌‌ చిత్రం ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విడుదల

జాకీష్రాఫ్, ప్రియమణి, సన్నీలియోన్, సారా అర్జున్ లీడ్ రోల్స్‌‌‌‌‌‌‌‌లో తెరకెక్కుతున్న తమిళ చిత్రం ‘కొటేషన్ గ్యాంగ్‌‌‌‌‌‌‌‌’. వివేక్ కుమార్ కన్నన్​ దర్శకుడు.  తాజాగా ఈమూవీ ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. సుపారీకి హత్యలు చేసే గ్యాంగ్‌‌‌‌‌‌‌‌ కథ ఇదని ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బట్టి అర్థమవుతోంది. ప్రియమణి, సన్నీలియోన్ డబ్బు కోసం మనుషులను చంపే క్రిమినల్స్‌‌‌‌‌‌‌‌గా కనిపించారు. 

గ్యాంగ్ వార్స్‌‌‌‌‌‌‌‌ నేపథ్యంలో ఓ బడా గ్యాంగ్‌‌‌‌‌‌‌‌ స్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను హత్య చేయడంతో వీరి జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయనేదే అసలు కథ. కాన్సెప్ట్, విజువల్స్ చూస్తుంటే ‘దండుపాళ్యం’ సినిమా గుర్తొస్తోంది. అలాగే ఇందులో ఓ క్యూట్ లవ్ స్టోరీ కూడా ఉంది.  మొత్తానికి ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంటరెస్టింగ్‌‌‌‌‌‌‌‌గా ఉంది. దర్శకుడు వివేక్ కుమార్ కన్నన్​తో కలిసి గాయత్రి సురేశ్ నిర్మిస్తున్నారు.  రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్ పార్ట్‌‌‌‌‌‌‌‌ను జులైలో విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.