- వక్ఫ్ బోర్డు బాధిత జేఏసీ కుత్బుల్లాపూర్‌లో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేత
జీడిమెట్ల, వెలుగు: కుత్బుల్లాపూర్‌లోని సర్వే నంబర్ 58 నుంచి 226 వరకు ఉన్న సుమారు 1200 ఎకరాల భూమిలో 41 గుంటల వక్ఫ్ బోర్డు భూమి ఉందని, అందువల్ల ఇక్కడి భూములు, ఇండ్ల స్థలాల రిజిస్ట్రేషన్ నిలిపివేయడం అన్యాయమని వక్ఫ్ బోర్డు బాధిత జేఏసీ నాయకులు అన్నారు. మంగళవారం కుత్బుల్లాపూర్‌లోని అంబేద్కర్ విగ్రహానికి జేఏసీ నాయకులు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వాధికారులు 41 గుంటల భూమి ఎక్కడ ఉందో తేల్చాల్సింది పోయి.. 1200 ఎకరాల్లో భూములు, ఇండ్లు, స్థలాల రిజిస్టేషన్లు నిలిపివేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. ఏండ్ల తరబడి నివాసముంటున్న వారు తమ పిల్లల ఉన్నత చదువులు, వివాహాల కోసం ఇండ్లు, స్థలాలు అమ్ముకోలేని పరిస్థితి నెలకొందన్నారు. అధికారులు స్పందించి వెంటనే రిజిస్ట్రేషన్లు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వక్ఫ్‌బోర్డు బాధిత జేఏసీ నాయకులు ఆకుల సతీశ్, నల్లా జయశంకర్, చందు, శ్యాంకుమార్‌రెడ్డి, అరుణ్‌రావు, కుమార్‌గౌడ్, తేజ తదితరులు పాల్గొన్నారు.