![విద్యార్థులను క్రీడాకారులుగా తయారు చేసేదే పీఈటీలే..](https://static.v6velugu.com/uploads/2025/02/r-krishnaiah-comments-at-pet-thanks-meet_9h8rQqVD3b.jpg)
- పీఈటీల కృతజ్ఞత సభలో ఆర్ కృష్ణయ్య
బషీర్ బాగ్, వెలుగు : రాష్ట్రంలోని గురుకులవిద్యార్థులను క్రీడాకారులు తీర్చి దిద్దేది పీఈటీలే అని పార్లమెంట్ సభ్యులు ఆర్ కృష్ణయ్య అన్నారు. తెలంగాణ సంక్షేమ గురుకుల స్కూల్స్ వ్యాయామ విద్యా ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో రాష్ట్ర ప్రభుత్వానికి పీఈటీల కృతజ్ఞత సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వంలో కోర్టు కేసులతో ఆగిపోయిన 360 పీఈటీ పోస్టింగ్లను కాంగ్రెస్ ప్రభుత్వం భర్తి చేసిందని తెలిపారు.
అలాగే హై స్కూల్లో ఖాళీగా ఉన్న 1600 పోస్టులను కూడా భర్తీ చేయాలన్నారు. అనంతరం ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాదగోని సైదులు గౌడ్ , జేఏసీ చైర్మన్ లీలం వెంకటేష్, రాష్ట్ర జూనియర్ కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్స్ అసోసియేషన్ డాక్టర్ బి. లక్ష్మయ్య. ప్రధాన కార్యదర్శి ఎం. పర్వతాలు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.