లాయర్లకు రాజకీయంగా అవకాశాలు కల్పించాలి

లాయర్లకు రాజకీయంగా  అవకాశాలు కల్పించాలి

ముషీరాబాద్, వెలుగు:  లాయర్లకు రాజకీయంగా అవకాశాలు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్‌‌‌‌. కృష్ణయ్య డిమాండ్ చేశారు.  ఆదివారం విద్యానగర్ బీసీ భవన్ లో తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ జేఏసీ ఆధ్వర్యంలో రూపొందించిన 76వ స్వాతంత్ర్య దినోత్సవ వాల్ పోస్టర్ ను కృష్ణయ్య ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ, అంబేద్కర్, జవహర్ లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్ లాంటి మహా నాయకులు లాయర్లుగా పనిచేశారని గుర్తు చేశారు.  తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ జేఏసీ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్ యాదవ్  మాట్లాడుతూ..  సమాజంలో మార్పు లాయర్లతోనే సాధ్యమన్నారు. వారు రాజకీయాల్లోకి ప్రవేశించి రాష్ట్రాన్ని, దేశాన్ని ప్రగతివైపు ప్రయాణించే దిశగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ బత్తుల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.