ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి .. రాజ్యసభలో ఆర్.కృష్ణయ్య డిమాండ్

ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి .. రాజ్యసభలో ఆర్.కృష్ణయ్య డిమాండ్

న్యూఢిల్లీ, వెలుగు: కేంద్రంలో ఓబీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని రాజ్యసభ ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. బుధవారం రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంలో మొత్తం 93 విభాగాలు ఉన్నాయని, ఇందులో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖలు ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం 58 కేంద్ర మంత్రిత్వ శాఖలు ఉండగా... తాజాగా ఫిషరీస్, సహకార మంత్రిత్వ శాఖలనూ కేంద్రం ఏర్పాటు చేసిందన్నారు. 

అలాగే క్రీడలు, సాంస్కృతిక కార్యకలాపాలు, ఇతర ప్రాముఖ్యత లేని వ్యవహారాలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖలు ఉన్నాయని గుర్తుచేశారు. కానీ, దేశంలో 56 శాతం జనాభా ఉన్న ఓబీసీల కోసం మాత్రం ప్రత్యేక మినిస్ట్రీ లేకపోవడం సమర్థనీయం కాదన్నారు.