ప్రభుత్వ భూములు అమ్మొద్దు : ఆర్.కృష్ణయ్య

ప్రభుత్వ భూములు అమ్మొద్దు : ఆర్.కృష్ణయ్య
  • విద్యార్థులకు హాస్టళ్లు, గురుకులాలకు సొంత బిల్డింగ్‌‌‌‌‌‌‌‌లు నిర్మించాలి: ఆర్.కృష్ణయ్య

ముషీరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని గచ్చిబౌలి, ఇతర ప్రాంతాల్లో ఉన్న సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూములను విక్రయించాలని ప్రభుత్వం చూస్తున్నదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య అన్నారు. ఆ భూముల్లో విద్యార్థుల కోసం హాస్టల్స్‌‌‌‌‌‌‌‌, గురుకులాకు సొంత భవనాలు నిర్మించాలని కోరారు. అలాగే, అద్దె భవనాల్లో కొనసాగుతున్న హాస్టల్స్‌‌‌‌‌‌‌‌కు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ‘ప్రభుత్వ భూములు అమ్మొద్దు.. హాస్టల్స్‌‌‌‌‌‌‌‌, గురుకులాల భవనాలు కట్టాలి’ అని కోరుతూ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ అధ్యక్షతన ఆదివారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌‌‌‌‌‌‌‌లో మహాధర్నా చేపట్టారు. 

ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వ స్థలాలు ప్రజల ఆస్తులని, వీటిని పేదల ఇండ్లు, ప్రభుత్వ ఆఫీసులు, హాస్టల్స్, స్కూల్స్ నిర్మాణానికి ఉపయోగించాలన్నారు. రెవెన్యూ పరంగా ప్రభుత్వ భూములను అమ్మడానికి ప్రయత్నిస్తే భావితరాలకు ఏమి మిగులుతుందని ప్రశ్నించారు. కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్, జిల్లపల్లి అంజి, రమాదేవి, నందగోపాల్, భారీగా విద్యార్థులు  పాల్గొన్నారు.