పెండింగ్ స్కాలర్షిప్‌లు విడుదల చేయాలి: ఆర్ కృష్ణయ్య

ముషీరాబాద్, వెలుగు: విద్యార్థుల ఫీజు బకాయిలు రూ. 4500 కోట్లను విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్కాలర్‌‌షిప్ ఫీజులు చెల్లించడంలో సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆదివారం బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ అధ్యక్షతన విద్యానగర్ బీసీ భవన్లో ఫీజు బకాయిలు, విద్యార్థుల స్కాలర్​షిప్​, నాణ్యమైన భోజనం అనే అంశంపై సమావేశం నిర్వహించారు. ఈ ప్రోగ్రాంలో  అనేక విషయాలను విద్యార్థులు ఆర్. కృష్ణయ్య దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి ఆర్. కృష్ణయ్య లెటర్​ రాశారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వృత్తి విద్య కోర్సు పూర్తి ఫీజు స్కీమును పునరుద్ధించాలని కోరారు.  కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్నారు కానీ చదువుకునే విద్యార్థులకు మెస్ బిల్లులు చెల్లించడం లేదన్నారు. స్కాలర్​షిప్​ను రూ. 5,500 నుంచి పదివేలకు పెంచాలని ప్రస్తుత స్కాలర్​షిప్​ రేట్లు 8 ఏండ్ల క్రితం నిర్ణయించారని గుర్తు చేశారు. పెరిగిన విద్యార్థుల కనీస అవసరాలను పరిగణలోకి తీసుకొని స్కాలర్షిప్ రేట్లు పెంచాలని కోరారు.