న్యూఢిల్లీ, వెలుగు: ఏపీ బీజేపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన ఆర్.కృష్ణయ్య పార్లమెంట్‌లో ప్రమాణం చేశారు. ఈ నెల 13న జరిగిన ఎన్నికల్లో బీజేపీ నుంచి ఆర్.కృష్ణయ్య, బీద మస్తాన్ రావు, సానా సతీశ్ టీడీపీ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం ఈ ముగ్గురు రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేశారు.
వీరితో చైర్మన్ జగదీప్ ధన్‌కడ్ ప్రమాణం చేయించారు. ఆర్.కృష్ణయ్య, సానా సతీశ్ తెలుగులో, బీద మస్తాన్ రావు ఇంగ్లీష్‌లో ప్రమాణం చేశారు. కాగా, ఈ ఏడాది ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత... ఆర్.కృష్ణయ్య, బీద మస్తాన్ రావు వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.