జడ్చర్ల, వెలుగు: అసెంబ్లీ, పార్లమెంట్ఎన్నికల్లో బీసీలకు 50 శాతం సీట్లివ్వకుంటే ఓట్లేయబోమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హెచ్చ రించారు. మహబూబ్‌నగర్‌జిల్లా జడ్చర్ల లో ఆయన గురువారం నిర్వహించిన ప్రెస్‌మీట్ లోమాట్లాడారు. ఈ విషయంపై తమ వైఖరి ఏమిటో అన్ని పొలిటికల్పార్టీలు తేల్చి చెప్పాలన్నారు.
గత ఎన్నికల్లో బీఆర్ఎస్ బీసీలకు 26 సీట్లిచ్చి, ప్రస్తుతం 21 సీట్లను మాత్రమే ఇచ్చిందన్నారు. సీట్లు, ఓట్లు అనే నినాదంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘాలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్‌సమావేశాల్లో బీసీ బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించాలన్నారు. నాయకులు బూర్గుపల్లి కృష్ణయ్య యాద వ్, ఎర్ర సత్య నారాయణ, వేముల రామకృష్ణ, కృష్ణుడు ఉన్నారు.