- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య
బషీర్ బాగ్, వెలుగు: ప్రభుత్వం పెండింగ్పెట్టిన రూ.4 వేల కోట్ల ఫీజు బకాయిలను రెండు రోజుల్లో విడుదల చేయాలని, లేకుంటే కలెక్టరేట్లు, విద్యా శాఖ ఆఫీసులను ముట్టడిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజెస్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బీసీ విద్యార్థి సంఘం నేత వేముల రామకృష్ణ అధ్యక్షతన మంగళవారం విద్యార్థుల రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహించారు.
ఆర్.కృష్ణయ్య పాల్గొని మాట్లాడారు. ఫీజుల బకాయిల కోసం కాలేజీ యజమాన్యాలు నిరవధిక బంద్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని సూచించారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డా.బొజ్జ సూర్యనారాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శి యాడ రామకృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.పరమేశ్వర్, టి. శ్రీధర్ రావు, బీసీ విద్యార్థి సంఘం నేతలు జిల్లపల్లి అంజి, అనంతయ్య, రాందేవ్, జి. మల్లేష్, నీల వెంకటేష్
తదితరులు పాల్గొన్నారు.