బీజేపీతోనే బీసీ రిజర్వేషన్లు..ఆర్ కృష్ణయ్య

  • బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్ కృష్ణయ్య
  • ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు నామినేషన్ 

ఢిల్లీ: బీజేపీతోనే చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లు సాధ్యమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. ఇవాళ రాజ్యసభకు ఏపీ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆయన నామినేషన్ దాఖలు చేశారు. మెడలో కాషాయ కండువాతో పార్లమెంట్ ఆవరణలో కనిపించిన ఆయన.. నామినేషన్ అనంతరం మీడియాతో మాట్లాడారు.. 

తాను చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లపై పోరాటం చేస్తానని.. బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ తోనే సాధ్యమని చెప్పుకొచ్చారు. తాను బీసీల కోసం చేస్తున్న సేవలను గుర్తించి బీజేపీ తనకు రాజ్యసభ ఎంపీగా అవకాశం కల్పించిందని, తనకు టికెట్ ఇచ్చిన ప్రధానమంత్రి మోదీకి ధన్యవాదాలు తెలుపుతున్నట్టు కృష్ణయ్య వెల్లడించారు.