గురుకులాలకు సొంత బిల్డింగులు కట్టాలి : ఆర్.కృష్ణయ్య

గురుకులాలకు సొంత బిల్డింగులు కట్టాలి : ఆర్.కృష్ణయ్య
  • స్టూడెంట్ల మెస్ చార్జీల పెంపు హర్షనీయం

ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 295 బీసీ కాలేజీ హాస్టళ్లకు, 321 బీసీ గురుకుల స్కూళ్లకు సొంత భవనాలు లేవని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. వాటికి కేటాయించిన స్థలాలను కూడా అధికారులు ప్రైవేట్ సంస్థలకు ధారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. విద్యానగర్ బీసీ భవన్ లో జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ ఆధ్వర్యంలో నిరుద్యోగ, విద్యార్థుల సమావేశం జరిగింది. దీనికి కృష్ణయ్య హాజరై, మాట్లాడారు. దేశ, రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా  ఫ్లైఓవర్లు, స్కై ఓవర్స్ కట్టినట్లే.. భావితరాల కోసం అన్ని రకాల వసతులు కల్పించాలని కోరారు.

 విద్యార్థుల మీద దృష్టి సారించకపోతే భవిష్యత్తు దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. కాగా..హాస్టల్స్, గురుకుల పాఠశాల విద్యార్థులకు మెస్ చార్జీలు పెంచడం హర్షనీయమని కృష్ణయ్య తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు  కృతజ్ఞతలు తెలిపారు.