4 వేల కోట్ల ఫీజు బకాయిలు రిలీజ్ చేయాలి : ఆర్.కృష్ణయ్య

4 వేల కోట్ల ఫీజు బకాయిలు రిలీజ్ చేయాలి : ఆర్.కృష్ణయ్య
  •  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఆర్.కృష్ణయ్య వినతి 

ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 20 లక్షల మంది విద్యార్థులకు రావాల్సిన రూ.4వేల కోట్ల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. హాస్టల్లో ఉండి చదువుకుంటున్న బడుగు, బలహీన వర్గాలకు చెందిన స్టూడెంట్లకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలని కోరారు. గురువారం బీసీ నేతలతో కలిసి ఆర్.కృష్ణయ్య సెక్రటేరియెట్ లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు.

ప్రభుత్వం హాస్టల్ అద్దె బిల్లులు, కరెంటు బిల్లులు, బీసీ కాలేజీ హాస్టల్ మెస్ చార్జీలు చెల్లించకపోవడంతో విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇంజనీరింగ్, ఫార్మసీ, మెడిసిన్ డిగ్రీ, పీజీ కోర్సులు చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ఫీజు మినహాయింపు ఉందన్నారు. విద్యార్థుల స్టై పండ్ బకాయిలు ఇవ్వాలని కోరారు. జిల్లపల్లి అంజి, నీల వెంకటేశ్, పగిళ్ల సతీశ్ తదితరులు ఉన్నారు.