పేపర్ లీకేజీలు..విద్యార్థుల భవిష్యత్ ఏం కావాలి?: ఆర్.నారాయణమూర్తి

పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి దర్శకత్వ వహిస్తూ నటించిన తాజా చిత్రం “యూనివర్సిటీ” ఈ మూవీ మంగళవారం సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆర్ నారాయణ మూర్తి మీడియా సమావేశంలో మాట్లాడారు.

"స్నేహ చిత్ర పిక్చర్స్ "యూనివర్సిటీ" చిత్రం సెన్సార్ పూర్తి అయింది.అతి త్వరలో ఆడియో రిలీజ్ చేసి త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల జేస్తాం. 10వ తరగతి పేపరు లీకేజీలు.. గ్రూపు 1,2 లాంటి ఉద్యోగ పరీక్షల్లోనూ పేపరు లీకేజీలు.. ఇలా అయితే విద్యార్థుల భవిష్యత్ ఏం కావాలి ? నిరుద్యోగుల జీవితాలు ఏమైపోవాలి?

లంబ కోణాలు నేర్పిన వాళ్ళే కుంభకోణాలు జేస్తూ ఉంటుంటే రెక్కలు తెగిన జ్ఞాన పావురాలు విలవిల కోట్టుకుంటూ ఊపిరాడక గింజు కుంటుంటే.. ఈ విద్యావ్యవస్థ, ఈ ఉద్యోగవ్యవస్థ నిర్వీర్యం కావాలా?.. కాకూడదు. మనది నిరుద్యోగ భారతం కాదు. ఉద్యోగ భారతం కావాలి అని చాటి చెప్పే చిత్రమే ఈ “యూనివర్సిటీ” అని  నారాయణ మూర్తి అన్నారు. కాగా, ఈ చిత్రానికి కథ–స్క్రీన్ ప్లే, మాటలు,సంగీతం,దర్శకత్వం,నిర్మాతగా ఆర్ నారాయణ మూర్తి వ్యవహరించారు.
ఆర్. నారాయణ మూర్తి