ప్రపంచ బ్లిట్జ్ ఛాంపియన్‌షిప్‌.. కాంస్యం సాధించిన ప్రజ్ఞానానంద సోదరి

ప్రపంచ బ్లిట్జ్ ఛాంపియన్‌షిప్‌.. కాంస్యం సాధించిన ప్రజ్ఞానానంద సోదరి

ప్రపంచ బ్లిట్జ్ ఛాంపియన్‌షిప్‌ మహిళల విభాగంలో భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానానంద సోదరి వైశాలి కాంస్యం గెలుచుకుంది. చైనాకు చెందిన జు జినర్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌ పోరులో 2.5-1.5 తేడాతో విజయం సాధించి వైశాలి పతకం దక్కించుకుంది. అంతకుముందు ఆమె సెమీ-ఫైనల్‌లో చైనా ప్లేయర్ జు వెన్‌జున్ చేతిలో 0.5-2.5 తేడాతో పరాజయం పాలైంది. 

విశ్వనాథన్ ఆనంద్ ప్రసంశలు

ప్రపంచ బ్లిట్జ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించిన వైశాలికి ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ అభినందనలు తెలిపారు. ఆమె విజయం వెస్ట్‌బ్రిడ్జ్ ఆనంద్ చెస్ అకాడమీకి గర్వకారణమని కొనియాడారు.

ALSO READ | సీఏ ఎలెవన్‌‌ కెప్టెన్‌‌గా బుమ్రా