ప్రజ్ఞా జట్టుకు వరల్డ్‌‌ ర్యాపిడ్‌‌ టీమ్​ చెస్​ గోల్డ్‌‌

ప్రజ్ఞా జట్టుకు వరల్డ్‌‌ ర్యాపిడ్‌‌ టీమ్​ చెస్​ గోల్డ్‌‌

డ్యూసెల్డార్ఫ్( జర్మనీ):  చెస్ వరల్డ్‌‌ కప్‌‌లో టైటిల్​ మిస్సయిన ఇండియా గ్రాండ్‌‌ మాస్టర్‌‌ ఆర్‌‌. ప్రజ్ఞానంద  ఫిడే వరల్డ్ ర్యాపిడ్‌‌ టీమ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌ తొలి ఎడిషన్‌‌లో గోల్డ్​ అందుకున్నాడు. ఈ మెగా టోర్నీలో ప్రజ్ఞానందతో కూడిన డబ్ల్యూఆర్‌‌ చెస్‌‌ జట్టు విజేతగా నిలిచింది. విశ్వనాథన్‌‌ ఆనంద్‌‌ బరిలో నిలిచిన ఫ్రీడమ్‌‌ టీమ్​ రెండో ప్లేస్‌‌తో  సిల్వర్‌‌ గెలిచింది. తెలంగాణ జీఎం ఎరిగైసి అర్జున్‌‌, హారిక, పి. హరికృష్ణ, నిహాల్‌‌ సరిన్‌‌లతో కూడిన టీమ్‌‌ ఎండీజీ1 బ్రాంజ్‌‌  నెగ్గింది.