
న్యూఢిల్లీ : టీమిండియా మాజీ ఫీల్డింగ్ కోచ్, హైదరాబాద్‌కు చెందిన ఆర్. శ్రీధర్ అఫ్గానిస్తాన్ క్రికెట్ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా నియమితుడయ్యాడు. ముందుగా అతను సెప్టెంబర్‌లో న్యూజిలాండ్‌తో జరిగే ఏకైక టెస్టుతో పాటు సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌లో అఫ్గాన్ జట్టుకు సేవలందిస్తాడు. ఈ రెండు సిరీస్‌ల్లో శ్రీధర్ తన పాత్రను సమర్థవంతంగా నిర్వహించి ఫ్యూచర్‌లో లాంగ్ టర్మ్ కాంట్రాక్టు అందుకోవాలని ఆశిస్తున్నట్టు అఫ్గాన్ క్రికెట్ బోర్డు బుధవారం ప్రకటించింది.