న్యూయార్క్ : ఇండియా యంగ్ గ్రాండ్‌మాస్టర్ ఆర్. వైశాలి... వరల్డ్ బ్లిట్జ్ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లింది. విమెన్స్ సెక్షన్‌లో సోమవారం రాత్రి జరిగిన 11 రౌండ్లలో వైశాలి 9.5 పాయింట్లు సాధించి టాప్ ప్లేస్‌లో నిలిచింది. రష్యా ప్లేయర్ కెటరైనా లాగ్నో (8.5) రెండో ప్లేస్‌లో నిలవగా, మరో 6 గురు 8 పాయింట్లతో క్వార్టర్స్‌కు అర్హత సాధించారు. తెలుగు గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి (8) కూడా రేస్‌లో నిలిచినా టైబ్రేక్‌లో ఫెయిలైంది.
దీంతో 9వ స్థానంతో సరిపెట్టుకుంది. ద్రోణవల్లి హారిక (7).. 22 వ ర్యాంక్‌లో నిలిచింది. ఓపెన్ సెక్షన్‌లో ఇండియా నుంచి ఒక్కరు కూడా నాకౌట్ రౌండ్‌కు క్వాలిఫై కాలేదు. తెలంగాణ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఎరిగైసి (7).. 64వ ప్లేస్‌తో సంతృప్తి పడ్డాడు. ఆర్. ప్రజ్ఞానంద (8.5), రౌనక్ సాధ్వాని (8), అరవింద్ చిదంబరం (7), ప్రణవ్ (7) కూడా నిరాశపర్చారు.