Land for Job scam: ఈడీ విచారణకు బీహార్ మాజీ సీఎం రబ్రీదేవీ

Land for Job scam: ఈడీ విచారణకు బీహార్ మాజీ సీఎం రబ్రీదేవీ

బీహార్ మాజీ ముఖ్యమంత్రి, లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీదేవిని ఈడీ విచారించింది.మంగళవారం (మార్చి18) విచారణలో భాగంగా రబ్రీదేవీ, ఆమె కూతురు, ఎంపీ మిసా భార్తీ, కొడుకు, ఎమ్మెల్యే తేజ్ ప్రతాప్ యాదవ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరయ్యారు. ల్యాండ్స్ ఫర్ జాబ్స్ కేసులో వీరినిఈడీ విచారించింది.

మరోవైపు ఈ కేసులో పాట్నాలో మాజీ సీఎం, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ ను ఈడీ విచారించనుంది. ఈ కేసులో కొత్త కొత్త వాస్తవాలు బయటపడుతున్నందున మరోసారి విచారించనున్నట్లు అధికారులు తెలిపారు.  అవసరమని వారు సూచించారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద వీరి వాంగ్మూలాలను నమోదు చేయనున్నట్లు వారు తెలిపారు.

ALSO READ | అంతా ‘ఛావా’ మూవీ వల్లే.. నాగ్పూర్ హింసపై సీఎం ఫడ్నవీస్ సంచలన కామెంట్స్

ఈ కేసులో లాలూ ప్రసాద్, రబ్రీ దేవి, వారి చిన్న కొడుకు తేజస్వి యాదవ్‌లను ఈడీ గతంలో ప్రశ్నించింది. గతేడాది లాలూ కుటుంబ సభ్యులపై ఢిల్లీ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసిన ఈడీ.. రబ్రీ దేవి, వారి కుమార్తెలు మిసా భారతి, హేమాయాదవ్‌లతో పాటు మరికొంతమందిని నిందితులుగా పేర్కొంది.

కేంద్రంలో యూపీఏ ప్రభుత్వంలో ఉన్న సమయంలో రైల్వే మంత్రిగా ఉన్న లాలూ.. 2004 నుంచి 2009 మధ్య కాలంలో ఇండియన్ రైల్వేలో గ్రూప్ డి ఉద్యోగాల నియామకంలో అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలతో ఈడీ విచారణ చేస్తుంది. ఉద్యోగాలకోసం లంచంగా భూమిని ఇవ్వాలన్న ఆరోపణలతో సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసు ఆధారంగా లాలూ కుటుంబంపై మనీలాండరింగ్ కేసు నమోదు అయింది.

ఈడీ చార్జిషీట్‌లో నిందితులుగా లాలూ ప్రసాద్ కుటుంబ సభ్యులు - రబ్రీ దేవి, మిసా భారతి,హేమా యాదవ్ ఉన్నారు. ఛార్జిషీట్‌లో పేరున్న మరో నిందితుడు హృదయానంద్ చౌదరి, రబ్రీ దేవి గోశాలలో మాజీ ఉద్యోగి, అతను అభ్యర్థులలో ఒకరి నుండి ఆస్తిని సంపాదించి, తరువాత దానిని హేమా యాదవ్‌కు బదిలీ చేసాడు" అని ED అభియోగాలు మోపింది. 

మనీలాండరింగ్ కేసులో బుధవారం మరోసారి లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవీ, ఎంపీ మిసా భార్తీ, ఎమ్మెల్యే తేజ్ ప్రతాప్ యాదవ్ లు ఈడీ ముందు హాజరు కానున్నారు.