- క్షేత్రస్థాయిలో పర్యటించిన రాచకొండ సీపీ
ఎల్బీనగర్, వెలుగు: పోలీస్ వ్యవస్థపై నమ్మకం పెరిగేలా పనిచేయాలని రాచకొండ సీపీ సుధీర్‌బాబు సిబ్బందికి సూచించారు. బుధవారం ఆయన ఎల్బీనగర్పరిధిలోని ఎన్టీఆర్నగర్లో పర్యటించారు. స్థానికులతో మాట్లాడారు. కమిషనరేట్పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు అన్ని వేళలా అందుబాటులో ఉంటారని చెప్పారు. విజిబుల్ పోలీసింగ్ కు అధిక ప్రాధ్యాన్యం ఇస్తున్నామన్నారు.
అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100 ,112 టోల్ ఫ్రీ నంబర్లకు ఫిర్యాదు చేయాలని సూచించారు. మహిళల రక్షణ కోసం అన్ని ప్రాంతాల్లో షీ టీమ్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అలాగే విజిబుల్పోలీసింగ్డ్యూటీ చేస్తున్న సిబ్బందితో సీపీ మాట్లాడారు. సీపీ వెంట ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్, మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి, ఎస్ఓటీ డీసీపీ మురళీధర్, ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ పాల్గొన్నారు.