ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలి

  • రాచకొండ సీపీ సుధీర్ బాబు

చౌటుప్పల్ వెలుగు : భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని రాచకొండ సీపీ సుధీర్ బాబు ఆదేశించారు. సోమవారం రాచకొండ కమిషనరేట్ పరిధిలోని దండుమల్కాపురం చెరువు, పంతంగి టోల్ గేట్ ను ఆయన సందర్శించారు. అనంతరం చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ సందర్శించి రికార్డులను పరిశీలించడంతోపాటు పలు విభాగాల పని తీరు, సీసీటీవీల నిర్వహణ వంటి అంశాలను సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యాత్మక ప్రాంతాల్లో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. మహిళా భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట డీసీపీ అరవింద్ బాబు, ట్రాఫిక్ డీసీపీ మనోహర్, అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ, చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్ రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ ప్రభాకర్ రెడ్డి, చౌటుప్పల్ సీఐ మన్మథకుమార్, ఎస్ఐలు, సిబ్బంది ఉన్నారు.