హైదరాబాద్ సరూర్ నగర్ కిడ్నీ రాకెట్ కేసులో 9 మందిని అరెస్ట్ చేశామని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు.మరి కొంత మందిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని చెప్పారు. ముఠా సభ్యులు ఇప్పటి వరకు 20 మందికి కిడ్నీలు మార్పిడి చేశారని తెలిపారు. ఒక్కొక్కరి నుంచి రూ. 60 లక్షల చొప్పును మొత్తం రూ.12 కోట్ల వరకు వసూలు చేశారని చెప్పారు సీపీ.
2023 నుంచి హైదరాబాద్ లో అక్రమంగా కిడ్నీ మార్పిడి దందా చేస్తోంది డాక్టర్ అవినాష్ గ్యాంగ్. 2022లో డాక్టర్ సుమంత్ సరూర్ నగర్ లో అలకనంద ఆసుపత్రి పెట్టాడు. డాక్టర్ అవినాష్ సర్జరీ చేశారు.. బయట నుంచి డాక్టర్స్ ని తెచ్చి ఆపరేషన్స్ చేస్తున్నారు. అవినాష్.. జనతా,అరుణ ఆసుపత్రిలో గతంలో చేశారు. చైనాలో ఎంబీబీఎస్ చదివి వచ్చిన డాక్టర్ అవినాష్ ఈ ముఠాలో కీలకంగా ఉన్నాడు. ఆర్థిక నష్టాల్లో ఉన్న అవినాష్ కిడ్నీ మార్పిడి దందాకు దిగాడు. నశ్రీమ్ భాను, ఫిర్ధోస్, డోనర్స్..రాజశేఖర్, ప్రభ ఇద్దరు రెసివర్స్ ఉన్నారు. ఆసుపత్రి తనిఖీ చేసిన సమయంలో నలుగురిని అరెస్ట్ చేశాం. డాక్టర్స్ అవినాష్, సుమంత్ లు.. ప్రవీణ్ , మిశ్రా, గోపి, మెడికల్ అసిస్టెంట్స్ రవీందర్, హరీష్ సాయిలు 9మందిని అరెస్ట్ చేసాం. ఇప్పటివరకు ఆరుగురు పరారీలో ఉన్నారు. ఇతర రాష్ట్రాల డాక్టర్లు కూడా ఉన్నారు. త్వరలోనే వాళ్లను పట్టుకుంటాం. అని సుధీర్ బాబు మీడియాకు తెలిపారు.
ALSO READ | ఇంత టాలెంటెడ్ ఐడియానా : దావోస్ పెట్టుబడులపై.. కేసీఆర్, కేటీఆర్ కడపు మంటతో హోర్డింగ్స్