ఇసుక అక్రమ రవాణా చేస్తే చర్యలు : సీపీ సుధీర్​బాబు

ఇసుక అక్రమ రవాణా చేస్తే చర్యలు  : సీపీ సుధీర్​బాబు

యాదాద్రి, వెలుగు : ఇసుక అక్రమ రవాణా చేస్తే చర్యలు తప్పవని రాచకొండ సీపీ సుధీర్​బాబు హెచ్చరించారు. యాదాద్రి జిల్లా ఆలేరు, భువనగిరి, బీబీనగర్​లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆలేరులోని పెద్దవాగును ఆయన పరిశీలించారు. ఇసుక తవ్విన ఆనవాళ్లు కన్పించడంతో ఆయన సీరియస్ అయ్యారు. 

ఇసుకను అక్రమంగా రవాణా చేసిన వారు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదన్నారు. అయితే ఇండ్ల నిర్మాణం కోసం అనుమతి తీసుకున్న వారికి సక్రమంగా ఇసుకను అందించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం భువనగిరి, బీబీనగర్​లో ఆయన పర్యటించి ఆయా పరిధిలోని పీఎస్​ల్లో కేసుల నమోదు తదితర వివరాలు తెలుసుకున్నారు.