ఇద్దరు రౌడీషీటర్లను నగర బహిష్కరణ చేసిన రాచకొండ సీపీ

ఇద్దరు రౌడీషీటర్లను నగర బహిష్కరణ చేసిన రాచకొండ సీపీ

రిపీటెడ్ నేరాలకు పాల్పడుతున్న  రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఇద్దరు రౌడీషీటర్లను  నగర బహిష్కరణ చేశారు సీపీ సుదీర్ బాబు. నల్గొండకు చెందిన నలప రాజు రాజేష్ అలియాస్ మెంటల్ రాజేష్, మీర్ పేటకు చెందిన సురేందర్ అలియాస్ సూరిని  నగర బహిష్కరణ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. 

మెంటల్ రాజేష్ మీద 33 కేసులు ఇందులో 4 మర్డర్లు.. మీర్ పేట్ కు చెందిన సూరిపై  21 కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.  ఇద్దరు నేరస్థులను సెక్షన్ 261 సిటీ యాక్ట్ ప్రకారం నగర బహిష్కరణ చేస్తున్నట్టు చెప్పారు. నేరస్థులకు నగరంలో చోటు లేదన్నారు సీపీ సుధీర్ బాబు. క్రిమినల్స్ ను ఎవర్నీ వదిలిపెట్టబోమని చెప్పారు. 

►ALSO READ | లోన్ యాప్స్ వేధింపులకు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య..