యాదాద్రి, వెలుగు : మహిళల భద్రతకు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నామని రాచకొండ సీపీ తరుణ్ జోషి చెప్పారు. శనివారం బీబీనగర్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పోలీసు వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగించాలని, బాధితులు ధైర్యంగా స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసే వాతావరణం ఉండాలన్నారు. మహిళల భద్రత కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని
వారి ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తున్నట్లు చెప్పారు. పిల్లల ఆదరణకు నోచుకోని తల్లిదండ్రులు, పీఎస్‌కు రాలేని బాధితులు రాచకొండ కంట్రోల్ రూమ్ వాట్సప్ నెంబర్ 8712662111 ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి డీసీపీ రాజేశ్ చంద్ర , భువనగిరి ఏపీసీ, సిబ్బంది పాల్గొన్నారు.