
యాదాద్రి జిల్లా ఆలేరు పోలీస్ స్టేషన్ ను రాచకొండ సీపీ సుధీర్ బాబు సోమవారం రాత్రి ( డిసెంబర్ 30) ఆకస్మికంగా తనిఖీ చేశారు. నూతన సంవత్సర వేడుకల పై ఆంక్షలు ఉన్నాయని, నూతన సంవత్సర వేడుకలు విందు వినోదాలకు ఎలాంటి పర్మిషన్ లేదని రాచకొండ సీపీ తెలిపారు. పోలీస్ స్టేషన్ లో పెండింగ్ లో ఉన్న కేసుల వివరాలు,ఆలేరు స్టేషన్ లో పనిచేస్తున్న సిబ్బంది వివరాలు తెలుసుకున్నారు. పెండింగ్ లో ఉన్న కేసులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. గంజాయి, గుట్కా అక్రమ మద్యం పై ఉక్కు పాదం మోపాలని సీఐ కొండల్ రావు కు ఎస్ఐ రత్నకర్ కు సూచించారు. నియమాలకు విరుద్దంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.