- 10 లీటర్ల హాష్ ఆయిల్ స్వాధీనం
మల్కాజిగిరి/మెహిదీపట్నం, వెలుగు: ఆర్టీసీ బస్సుల్లో గంజాయి, హాష్‌ఆయిల్ ను స్మగ్లింగ్చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. రూ.1.52 కోట్ల విలువ చేసే 10.2 లీటర్ల హాష్ఆయిల్ను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం నేరెడ్‌మెట్‌లోని తన ఆఫీసులో సీపీ సుధీర్‌బాబు కేసు వివరాలు వెల్లడించారు. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా కోలమామిడికి చెందిన గమ్మెలి గోవిందరావు(36), రాహుల్పేటకు చెందిన కొర్ర రాంబాబు(30) స్థానికంగా వ్యవసాయం చేస్తూ.. ఈజీ మనీ కోసం హాష్‌ఆయిల్ విక్రయిస్తున్నారు.
ఇటీవల ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలని ప్లాన్ చేశారు. అదే ప్రాంతంలో ఉండే చంటి, లక్ష్మీనాయుడు వద్ద 10.2 లీటర్ల హాష్ఆయిల్కొన్నారు. ఆ మొత్తాన్ని పాలిథిన్కవర్లలో ప్యాక్‌చేసుకుని, ఈనెల 25న ఆర్టీసీ బస్సులో హైదరాబాద్బయలుదేరారు. 26న ఉదయం యాద్రాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని కొత్తగూడ ఎక్స్ రోడ్డులో దిగారు. సమాచారం అందుకున్న భువనగిరి ఎస్ఓటీ, పోచంపల్లి పోలీసులు గోవిందరావు, రాంబాబును అదుపులోకి తీసుకున్నారు. 10.2లీటర్ల హాష్ఆయిల్స్వాధీనం చేసుకున్నారు. బయటి మార్కెట్లో దాని విలువ రూ.కోటి52 లక్షల20 వేలు ఉంటుందని సీపీ సుధీర్‌బాబు వెల్లడించారు.
ఇబ్రహీంపట్నంలో 60 కిలోల గంజాయి
కారులో గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని మహేశ్వరం ఎస్ఓటీ, ఇబ్రహీంపట్నం పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్రలోని నాసిక్, మాలేగావ్‌కు చెందిన వాల్మిక్ రూపా మోహితే(53) ఉల్లిగడ్డల వ్యాపారి. ఇతని వద్ద భాటు దేవరమ్చవాన్(39) హెల్పర్ గా పనిచేస్తున్నాడు. వీరిద్దరూ కొన్ని నెలల కింద ఉల్లిగడ్డల లోడుతో వైజాగ్వెజిటబుల్మార్కెట్ కు వెళ్లారు. అక్కడ తిరుపతి అనే వ్యక్తి గంజాయి తాగుతుండడం చూసి, ఎక్కడ దొరుకుతుందో తెలుసుకున్నారు.
ఈజీ మనీ కోసం గంజాయి స్మగ్లింగ్చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం కారు కొన్నారు. స్టేట్మారినప్పుడల్లా కారు నంబర్ప్లేట్లు మారుస్తూ గంజాయి స్మగ్లింగ్చేస్తున్నారు. ఈ నెల 25న మరోసారి కారులో వైజాగ్వెళ్లారు. 60 కిలోల గంజాయిని కొన్నారు. తిరిగొస్తుండగా హైదరాబాద్శివారులోని ఇబ్రహీంపట్నం వద్ద పోలీసులు పట్టుకున్నారు. 30 ప్యాకెట్లుగా చేసిన 60 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సీపీ సుధీర్‌బాబు తెలిపారు.
ధూల్‌పేటలో 1.2కిలోలు
ధూల్‌పేటలోని మాచిపురాలో దినేశ్‌సింగ్ అనే వ్యక్తి గంజాయి అమ్ముతున్నాడని ఎక్సైజ్ పోలీసులకు సమాచారం అందింది. మంగళవారం ఉదయం సోదాలు నిర్వహించగా, అతని వద్ద 1.215 కేజీల గంజాయి దొరికింది. దినేశ్‌తోపాటు కర్ణాటకకు చెందిన సోపన్ రావు, మహమ్మద్ సోహెల్ గంజాయి అమ్ముతున్నట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్అంజిరెడ్డి తెలిపారు. వీరిద్దరూ పరారీలో ఉన్నారు.