ఇంటర్ నేషనల్ డ్రగ్స్ ముఠా అరెస్టు.. రూ.55 లక్షల డ్రగ్స్ సీజ్

నగరంలో ఇంటర్ నేషనల్ డ్రగ్స్ ముఠాను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి.. రూ.55 లక్షల విలువైన డ్రగ్స్‭ని సీజ్ చేశారు. నిందితులు మలేషియా నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి.. ఆస్ట్రేలియాలో అమ్ముతున్నట్లు గుర్తించారు. ఈ ముఠా డ్రగ్స్, గోల్డ్, ఎలక్ట్రానిక్ గూడ్స్ కూడా స్మగ్లింగ్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను మహారాష్ట్ర, పూణెకు చెందిన షేక్ ఫరీద్ మహ్మద్, ఫైజాన్‭లుగా గుర్తించారు. ఇతర వస్తువుల్లో డ్రగ్స్ పెట్టి అనుమానం రాకుండా విదేశాలకు కొరియర్ ద్వారా సప్లై చేస్తున్నట్లు రాచకొండ పోలీసులు వెల్లడించారు. అయితే ఈ ముఠాకి తెలంగాణకి సంబంధం లేదన్నారు. చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో డ్రగ్స్ తీసుకెళ్తున్నట్లు చెప్పారు. ఇక ట్రాన్స్ పోర్ట్ చేసే వారితో పాటు డ్రగ్స్ ఫెడ్లర్లు, సేవించే వారిపైనా నిఘా పెట్టామని రాచకొండ సీపీ చౌహాన్ స్పష్టం చేశారు.