ఒడిశా నుంచి హర్యానాకు గంజాయి

ఒడిశా నుంచి హర్యానాకు గంజాయి

 

  • సిటీ మీదుగా తరలిస్తున్న ఇద్దరిని పట్టుకున్న రాచకొండ పోలీసులు
  • రూ. కోటి 28 లక్షలు విలువైన 510 కిలోల గాంజా స్వాధీనం

హైదరాబాద్, వెలుగు: ఒడిశా నుంచి హర్యానాకు సిటీ మీదుగా గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ తెలిపిన వివరాల ప్రకారం.. జమ్మూ కాశ్మీర్​కు చెందిన మనోహర్(55), హర్యానాకు చెందిన ప్రవీణ్(45) కొంతకాలంగా ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయిని ట్రాన్స్ పోర్టు చేస్తున్నారు. రెండ్రోజుల కిందట వీరిద్దరు ఒడిశాలోని కలిమెలకు వెళ్లారు. అక్కడి నుంచి 510  కిలోల గంజాయిని తీసుకుని ట్రాలీ ఆటోలో సిటీ మీదుగా హర్యానాకు బయలుదేరారు. సమాచారం అందుకున్న మల్కాజిగిరి ఎస్​వోటీ పోలీసులు శివార్లలో నిఘా పెట్టారు. మేడిపల్లి ఈ ఆటోను గుర్తించి మనోహర్, ప్రవీణ్​ను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. కోటి 28 లక్షల విలువైన 510 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్​కు తరలించినట్లు సీపీ చౌహాన్ తెలిపారు.