Rachakonda Commissionarate: 3వేల 484 కేజీల గంజాయి డిస్పోజ్ చేసి రాచకొండ పోలీసులు

హైదరాబాద్:రాచకొండ కమీషనరేట్ పరిధిలో పట్టుబడిన డ్రగ్స్, గంజాయిని  డిస్పోస్ చేసిన పోలీసులు. సుమారు 5కోట్ల 2లక్షల 30 రూపాయల విలువైన మాదక ద్రవ్యాలను డిస్పోస్ చేశారు.ఈ డ్రగ్స్ ను - రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో  గతేడాది 23 పోలీస్ స్టేషన్లలో 106 కేసుల్లో సీజ్ చేశారు. 

డిస్పోజ్ చేసిన డ్రగ్స్ లో 3484 కేజీ గం జాయి, 402 కేజీల నల్లమందు, 14 గ్రాముల ఎండీఎంఏ, 3 కేజీల500 గ్రాముల హ్యాస్ ఆయిల్, 5 గ్రాముల సైకోట్రోపిక్ , 100 గ్రాముల గంజాయి చాక్లెట్లు..నిందితులనుంచి 3891 గ్రాముల నార్కోటిక్ పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. డ్రగ్ డిస్పోజల కమిటీ పర్యవేక్షణలో యాదాద్రి భువ నగిరి జిల్లా తుక్కాపూర్ లో ఈ డిస్పోజ్ నిర్వహించారు.  కామన్ బయో మెడికల్ వేస్ట్ ట్రీట్ మెంట్ ఫెసిలిటీస్ ప్లాంట్ లో వీటిని డిస్పోజ్ చేశారు.