మీ బైక్ పార్క్ చేస్తున్నారా? జాగ్రత్త.. పార్కింగ్ చేసిన వాహనాలే వాళ్ల టార్గెట్

మీ  బైక్  పార్క్ చేస్తున్నారా? జాగ్రత్త.. పార్కింగ్ చేసిన వాహనాలే వాళ్ల టార్గెట్

హైదరాబాద్ లో దొంగలు రెచ్చిపోతున్నారు. ఈజీ మనీ కోసం పార్కింగ్ చేసిన వాహనాలు ఎత్తుకెళ్తున్నారు. ఎందుకైనా మంచిది మీ బండి పార్కింగ్ చేసినప్పుడు జాగ్రత్తగా ఉండండి. లేటెస్ట్ గా రాచకొండ కమిషనరేట్ పరిధిలో టూ వీలర్‌ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకున్నారు పోలీసులు. ముగ్గురు సభ్యులు గల ముఠాలో ఇద్దరిని అరెస్ట్ చేయగా.. మరొకరు పరారయ్యారు.  ఈ ముఠా నుంచి  30 టూవీలర్లను స్వాధీనం చేసుకున్నారు  పోలీసులు.  మూడు కమిషనరేట్ల పరిధిలో టూవీలర్ల దొంగతనాలు చేస్తున్నారు ముఠా సభ్యులు.

Also Read :- ఖాజాగూడ భగీరథమ్మ చెరువులో హైడ్రా కూల్చివేతలు

ఈజీ మనీ కోసం దొంగతనాలు చేయడం మొదలు పెట్టారని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు.  చెడు అలవాట్లకు బానిసలుగా మారి పార్కింగ్ చేసిన టూ వీలర్ లను చోరీ చేస్తున్నారు.  ఇక్కడ దొంగతనాలు చేసి నారాయణపేట్ లో మధ్యవర్తులకు అమ్మేవారు.  గతంలో మహ్మద్ అనే నిందితుడిని  జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు .  చోరీ కేసులో  ముగ్గురిపై  షీట్స్ ఓపెన్ చేయబోతున్నాం అని సీపీ వెల్లడించారు.