పోడు భూములపై కేసీఆర్ ప్రకటన చేయాలె

యాదాద్రి భువనగిరి  : సీఎం కేసీఆర్ బహిరంగ సభ నేపథ్యంలో సంస్థాన్ నారాయణపురం రాచకొండ తండావాసులు ఆందోళనకు సిద్ధమయ్యారు. గిరిజనులకు పోడు భూములు ఇవ్వకుంటే పార్టీ నాయకులెవరినీ గ్రామాల్లోకి రానివ్వమని హెచ్చరించారు. ఈ విషయంపై కేసీఆర్ సభ సాక్షిగా హామీ ఇవ్వకుంటే అడ్డుకుంటామని తేల్చి చెప్పారు.

పోడు భూముల వ్యవహారంలో ప్రభుత్వం స్పందించకుంటే రైతులందరూ నామినేషన్ వేయాలని నిర్ణయించారు. రాచకొండ తండాల్లో ఎలాంటి వసతులు కల్పించకుండా అడవిని నమ్ముకుని బతుకుతున్నామని చెప్పారు. తమ భూమిని తమకు లేకుండా చేస్తే దేనికైనా సిద్ధమని వార్నింగ్ ఇచ్చారు. మునుగోడు నియోజకవర్గంలోని దాదాపు 30వేల గిరిజన ఓట్లు ఉన్నాయని స్పష్టం చేశారు.